telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్ ?

Aishwarya-Rajesh

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. 70 శాతం షూటింగ్ ఫినిష్ కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు సీనియర్ హీరోయిన్ శ్రీయను కన్ఫర్మ్ చేసిన జక్కన్న.. తాజాగా మరో హీరోయిన్‌ని కూడా ఫైనల్ చేశారట. కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్‌కి స్కోప్ ఉండటంతో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ని తీసుకున్నారట రాజమౌళి. కొమరం భీమ్‌ను ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించనుందని టాక్. ఈ పాత్ర పరిధి తక్కువైనా, కథకు ఎంతో కీలకమని అంటున్నారు. ఈ మేరకి ఇప్పటికే ఐశ్వర్యతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని సమాచారం. మరోవైపు ఈ భారీ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌కు జంటగా శ్రియ నటిస్తోంది. ఐరిష్‌ అందాల భామ అలిసన్‌ డూడి లేడీ స్కాట్‌ పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ టీజర్ పలు వివాదాల్లో చిక్కున్నప్పటికీ భారీ ఆదరణ పొంది సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు.

Related posts