telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

Shivan

ప్రముఖ తమిళ దర్శకుడు బాబు శివన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న బాబు శివన్ ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడంతో అక్కడ ఆరోగ్యం మరింతగా క్షీణించి కన్నుమూశారు. ఇటీవల బాబు శివన్ ఇద్దరు కుమార్తెలు నీట్ పరీక్ష కోసం వెళ్లారు. వారితో పాటు ఆయన భార్య కూడా వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబు శివన్ భార్య, పిల్లలు వచ్చే సమయంకు కుప్పకూలిపోయి పడి ఉన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ కేవలం కరోనా పేషంట్స్ కు చికిత్స చేస్తామని చెప్పడంతో వెంటనే వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు లక్షల్లో ఖర్చుఅవుతుందని అన్నారు. దాంతో ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్, అనుష్క జంట తెరకెక్కిన సినిమా ‘వెట్టైకరన్’. ఈ సినిమాకు బాబు శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

Related posts