దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం ప్రీమియర్ షోలను నిన్న అమెరికాలో ప్రదర్శించారు. సినిమా చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది.
అయితే ఈ సినిమా ప్రీమియర్ షో “గౌతమీపుత్ర శాతకర్ణి” ప్రీమియర్ షో వసూళ్లను దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. “కథానాయకుడు” అమెరికాలో మొత్తంగా 4,40,000 డాలర్లు వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో 3 కోట్ల రూపాయలన్నమాట. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి అమెరికాలో రెండు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం “మహానాయకుడు” ఫిబ్రబరిలో 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!