గత సంవత్సరం “నా నువ్వే” అంటూ ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్ రామ్ భారీ డిజాస్టర్ ను చవి చూశారు. తాజాగా “118” అనే యాక్షన్ థ్రిల్లర్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సరికొత్తగా ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది.
సినిమాపై పెద్దగా బజ్ లేనప్పటికీ ప్రీమియర్ షో చూసిన వారు మాత్రం సినిమా బాగుందని కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటన బాగుందని, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సినిమా ద్వితీయార్థం అద్భుతంగా ఉన్నాయని, శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, గుహన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమా హిట్టే అన్పిస్తోంది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.
#118Movie 3/5
👉Flash back episode in second half, Haunting!
👉KalyanRam’s best look and best performance👌
👉BGM & CG are superb
👉KAGuhan Direction Good
👉 Racy Screenplay
👉Production value Good
👉NivethaThomas gets a meaty role for performance and she has nailed it.
— Movies Box Office (@MovieBoxoffice5) March 1, 2019
#118Movie is a Slick Thriller – Go watch it you wont get disappointed – Hit Movie @NANDAMURIKALYAN @i_nivethathomas @smkoneru
— Raaz CM (@RcMullapudi) March 1, 2019