telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఘనంగా .. లూయిస్‌ బ్రెయిలీ .. 211వ జయంతి వేడుకలు …

211th birthday celebrations of louis braille

అంధత్వాన్ని జయించి అంధులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ. ఆయన 211వ జయంతి వేడుకలు మలక్‌పేటలోని లూయిస్‌ బ్రెయిలీపార్క్‌లో శనివారం ఘనంగా జరిగాయి. వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశాఖ డైరెక్టర్‌ శైలజ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ జనరల్‌ మేనేజర్‌ ప్రభంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా ఫ్రొఫెసర్‌ రాజశేఖర్‌, న్యాయవాది చంద్ర సుప్రియ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా బ్రెయిలీ లిపిలో ముద్రించిన క్యాలెండర్‌ను, బ్రెయిలీ జీవితచరిత్రను ఆవిష్కరించారు.

1809, జనవరి, 4న ప్యారిస్‌లోని క్రూనే గ్రామంలో జర్మించిన లూయిస్‌ బ్రెయిలీ తన నాలుగో ఏట ప్రమాదవశాత్తూ కంటి చూపు కోల్పోయారు. అయినా మొక్కవోని ధైర్యంతో ఆయన తాను అనుకున్న సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు. చివరకు అంధులు కూడా చాలా సులభంగా చదువుకునేలా వారి కోసం బ్రెయిలీలిపిని కూడా ఆయన రూపొందించారు. అంధులు సరళంగా చదువుకోవడం ఎంతో సులభమైంది. బ్రెయిలీ లిపి నేర్చుకుని అనేక మంది అంధులు వద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సంగీత కళాకారులుగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారంటే అందుకు కారణం లూయిస్‌ బ్రెయిలీ అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

Related posts