telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హగ్స్, ముద్దులు అంటే భయమేస్తోంది… : రెజీనా

Regina

అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి రెజీనా కాసాండ్ర. ‘ఎస్ఎంఎస్ – శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం సిగ్గుపడని ఈ బ్యూటీ ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. అయితే ఇప్పుడు రెజీనా రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన రెజీనా తన రాబోయే చిత్రాల్లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేయడానికి తనకు భయమేస్తోందని రెజీనా చెప్పారు. తన రాబోయే చిత్రాల్లో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ముద్దు సన్నివేశాల్లో నటించడం తనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందని చెప్పారు. కానీ, కథకు అవసరం అనుకుంటే మన ఇబ్బందులు పక్కనబెట్టి ఇలాంటి సన్నివేశాలు చేయక తప్పదన్నారు. కాగా, విశాల్ ‘చక్ర’ సినిమాలో రెజీనా ఒక కీలక పాత్ర పోషించారు. ఆమెది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఇప్పటికే ఆమె ‘ఎవరు’ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి తనలోని వైవిధ్యమైన నటనను రెజీనా బయటపెట్టబోతున్నారని టాక్. తాజాగా విడుదలైన ‘చక్ర’ టీజర్‌లో రెజీనా పాత్రను రివీల్ చేయలేదు. ఈ పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంటున్నారు.

Related posts