telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2” ముహూర్తం ఖరారు

Nagarjuna

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో “మన్మథుడు” చిత్రం కూడా ఉంటుంది. నాగార్జున క్రేజ్ ను మరింతగా పెంచిన ఈ సినిమాకి సీక్వెల్ గా “మన్మథుడు-2” రూపొందనుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని నాగ్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగు జరపనున్నారట. తొలి షెడ్యూల్ 10 నుంచి 15 రోజుల పాటు జరగనున్నట్టుగా చెబుతున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో ‘బంగార్రాజు’ ప్రాజెక్టును కూడా నాగ్ పట్టాలెక్కించనున్నారు. తన సొంత బ్యానర్ పై రెండు సినిమాలను దాదాపు ఒకేసారి నాగ్ నిర్మిస్తుండటం విశేషం.

Related posts