telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడంటూ బావురుమన్న హీరోయిన్…!

Sana

టాలీవుడ్ కు సుపరిచితురాలైన సనా ఖాన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడంటూ బాధ పడుతోంది. తెలుగులో కళ్యాణ్ రామ్‌కు జోడీగా సనా ఖాన్ ‘కత్తి’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘గగనం’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఈ విషయంపై సనా మీడియాతో మాట్లాడుతూ “నేను మెల్విన్తో విడిపోయిన మాట నిజమే. నేను అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ అతను మరో అమ్మాయితో తిరుగుతూ నన్ను మోసం చేసాడు. నేను ప్రేమనిస్తే నాకు అతను బాధనిచ్చాడు. ఇప్పటికీ దీని నుంచి కోలుకోలేకపోతున్నా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అతను ఎవరితో ప్రేమలో ఉన్నాడో కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ అమ్మాయి పేరు చెబితే బాగోదు. నేను మెల్విన్‌తో ప్రేమలో ఉన్నానని తెలిసి చాలా మంది అతను ఎలాంటి వాడో చెప్పారు. నేను నమ్మలేదు. కొన్ని రోజుల క్రితం నాకు అతని తీరుపై అనుమానం వచ్చింది. అతని ఫోన్ చెక్ చేస్తుంటే వెంటనే లాక్కుని మెసేజ్‌లు డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే అతను నన్ను మోసం చేస్తున్నాడని అర్థమైంది. గతేడాది సెప్టెంబర్‌లో నాకు ఒంట్లో బాలేదు. కానీ అతను నన్ను కనీసం పట్టించుకున్నది కూడా లేదు. ఈ విషపూరితమైన ప్రేమ నుంచి దేవుడు నన్ను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. శారీరకంగా నేను బ్రేకప్ చెప్పాను కానీ. నా మనసంతా ఇంకా అతనే ఉన్నాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు అతన్ని నేను నమ్మలేను. ఇలాంటి వ్యక్తిని ప్రేమిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. రోజూ నేను నీతో ప్రేమలో పడేదాన్ని. రోజూ నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునేదాన్ని. కానీ నువ్విలా చేస్తావని అనుకోలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts