telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా బాధితులకు భారీ విరాళం ప్రకటించిన సచిన్

ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి.   ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వారికి సహాయం చేసేందుకు మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో మాస్టర్ పై ఫాన్స్ ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. మరీ కొందరు అయితే మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సహాయం చేయాలని కామెంట్స్ పెడుతున్నరు.  

Related posts