telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్.. మావైపు మాట్లాడవయ్యా… : ఏపీ మంత్రి నారాయణ

ap minister on pavan kalyan

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత, మొదటి ఎన్నికలలో పోటీచేయడం విరమించుకొని, అప్పటిలో టీడీపీ కి మద్దతు ప్రకటించారు. దీనితో 2014లో ఏపీలో టీడీపీ ఘనవిజయం సాధించింది. అయితే అనంతరం ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమిలేదని ఉద్దేశ్యంతో పవన్ తన మద్దతును ఉపసంహరించుకున్నారు. కానీ మళ్ళీ టీడీపీ పవన్ మద్దతు కోసం తీవ్రంగా ప్రయిత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల స్వయంగా చంద్రబాబు పవన్ తో కలిసి మళ్ళీ పనిచేస్తే తప్పేంటి అన్నారు. ఇక తాజాగా మంత్రి నారాయణ కూడా పరోక్షంగా అదే అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి టీడీపీ పవన్ అండదండల కోసం తీవ్రంగానే కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎన్నికల ముందు దీనిపై స్పష్టత లేకున్నా, ఎన్నికల అనంతరం అయినా వీరిద్దరూ కలిసి పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.

ఇక తాజాగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీని పన్నెత్తు మాట అనడం లేదని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. ఏపీకి దాదాపు రూ.75,000 కోట్లు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ప్రయోజనాల విషయంలో మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో మంత్రి నారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల విషయంలో కలిసి పోరాటం చేయడం సరైన మార్గమని తాను భావిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీతో కలిసి రావాలా? వద్దా? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహామీల కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఒంటరిగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెరవెనుక ఆడుతున్న నాటకానికి ప్రజలు 2019లో ముగింపు పలుకుతారని ఆయన అన్నారు.

Related posts