telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వైరల్ : పంత్ పై “భారత్ ఆర్మీ” పాట

Rishabh-Pant

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగా… పంత్ పై ఆయన అభిమానులు పాడిన పాట వైరల్ అవుతోంది. శుక్రవారం బ్యాటింగ్ లో పంత్ రెచ్చిపోతున్నప్పుడు “భారత్ ఆర్మీ” అనే టీమిండియా అభిమానుల బృందం ఓ పాట పాడారు. “వియ్ హ్యావ్ గాట్.. రిషభ్ పంత్, ఐ జస్ట్ డోంట్ థింక్ యు విల్ అండర్‌స్టాండ్, హి విల్ హిట్ యు ఫర్ సిక్స్, హి విల్ బేబీసిట్ యువర్ కిడ్స్…” అంటూ పంత్ పై తమ అభిమానాన్ని వెల్లడించారు. “‘మాకు పంత్ ఉన్నాడు.. రిషభ్ పంత్, ఈ విషయం మీకు అర్థం అయిందని నేననుకోను… అతడు సిక్సర్లూ కొట్టగలడు, పిల్లల్నీ ఆడించగలడు…” అనేది ఈ పాట అర్థం. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, రిషబ్ పంత్ మధ్య ఓ రేంజ్ లో స్లెడ్జింగ్ జరిగిందనే చెప్పాలి. అయితే ఆటను మైదానానికి పరిమితం చేసిన ఈ ఆటగాళ్లు ఆ తరువాత స్నేహితుల్లా కలిసిపోవడం గమనార్హం.

Related posts