పోలీసులు మీరట్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఓ హోటల్‌పై దాడిచేసి కొన్ని జంటలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న కొన్ని జంటలు కూడా వీరిలో ఉండడం విశేషం. వ్యభిచార ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)ను ఏర్పాటు చేశారు. హోటల్‌పై దాడిచేసి 36 మందిని అదుపులోకి తీసుకున్నది ఈ బృందమే. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు.
వీరిని విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు చెప్పారు. వారు చెప్పింది విని పోలీసులే షాకయ్యారు. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని, తమను వదిలేయాలని కొందరు ప్రాధేయపడ్డారు. తమకు నిశ్చితార్థం కూడా అయిపోయిందని, కావాలంటే చూడాలంటూ నిశ్చితార్థపు ఉంగరాలను కూడా చూపించారు. దీంతో పోలీసులు అటువంటి జంటలను అక్కడే వదిలిపెట్టారు. మిగతా వారిని మాత్రం స్టేషన్‌కు తీసుకెళ్లారు.
శ్రీరెడ్డి నిన్ను వదలా… ఎంతమందితో… : రాకేష్ మాస్టర్ ఫైర్