telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సముద్ర తీరంలో ఇల్లు కొన్న హృతిక్… దాదాపు రూ.100 కోట్లు ఖర్చు

Hrithik

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘సూపర్ 30’, ‘వార్’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు. తాజాగా హృతిక్ సుమారు రూ.100 కోట్లతో రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని జుహు-వెర్సొవా లింక్ రోడ్‌లో సముద్ర ముఖంగా మూడు అంతస్తుల మేర ఈ భవంతులు విస్తరించి ఉన్నాయి. రెండు అపార్ట్‌మెంట్లుగా ‘మేన్సన్-ఇన్-ద-ఎయిర్’ను హృతిక్ కొనుగోలు చేశారు. ఇందులో ఒకటి డూప్లెక్స్ పెంట్‌హౌస్ కాగా.. మరొకటి ఒక అంతస్తు ఇల్లు. ఈ రెండు ఇళ్ల కోసం హృతిక్ రోషన్ రూ.97.50 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఈ భవంతిలో రోషన్ ఫ్యామిలీ కోసం సొంతంగా ఎలివేటర్, 10 పార్కింగ్ స్లాట్స్‌ ఉన్నాయి. ముంబై మిర్రర్ కథనం మేరకు, హృతిక్ కొనుగోలు చేసిన రెండు భవంతులు 38,000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్నాయి. పైన 6,500 చదరపు అడుగుల టెర్రస్‌ను నిర్మించారు. ఈ టెర్రస్ అరేబియా సముద్ర ముఖంగా ఉంది. 15, 16వ అంతస్తుల్లో 27,534.85 చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న డూప్లెక్స్ హౌస్ కోసం రూ.67.50 కోట్లు, 14వ అంతస్తులో 11,165 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మరో ప్లాట్ కోసం రూ.30 కోట్లు హృతిక్ వెచ్చించినట్టు ప్రముఖ పత్రిక పేర్కొంది. వీటితో పాటు ఈ భవంతుల రిజిస్ట్రేషన్ కోసం రూ.1.95 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. కాగా ఇప్పుడు హృతిక్ ‘క్రిష్’ ఫ్రాంచైజ్‌లో నాలుగో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related posts