సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్గా ఉంటారు. తాజాగా 1995లో తను పాల్గొన్న మొదటి ఫొటో షూట్ అనుభవాలను పంచుకుంటూ అప్పటి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. `1995, సెప్టెంబర్ 9.. నేను మొదటిసారి కెమేరా ముందుకొచ్చి పాతికేళ్లు పూర్తయ్యాయి. అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. కానీ, విధి నా జీవితాన్ని వేరే విధంగా ప్లాన్ చేసింది. 16 ఏళ్ల వయసులో అనుకోకుండా నేను కెమేరా ముందుకు వచ్చాను. అప్పడే సినిమాలతో ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాసాలో శాస్త్రవేత్త కావాలనుకున్న నా కలను వదులుకోవాల్సి వచ్చినపుడు చాలా బాధపడ్డానని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
previous post
రణబీర్ కపూర్ పై కంగనా వ్యాఖ్యలు… స్పందించిన అలియా భట్