telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోటీ సినిమా పరంగానే… వ్యక్తిగతంగా కాదు… మోహన్ లాల్ పై మమ్ముట్టి వ్యాఖ్యలు

Mohan

మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వీరిద్దరికీ టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. “స్వాతికిరణం”, “యాత్ర” సినిమాలతో మమ్ముట్టి, “జనతాగ్యారేజ్”, “మనసంతా” సినిమాలతో మోహన్ లాల్ తెలుగు వారికి దగ్గరయ్యారు. అయితే స్టార్ హీరోలన్నాక సినిమాల విషయంలో భారీ పోటీ తప్పదు. మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్, మమ్ముట్టి మధ్య పోటీ గురించి తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ సినిమాలు చేస్తుంటారు. తాజాగా తమ మధ్య ఉన్న పోటీ గురించి మమ్ముట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ మధ్య ఇప్పటికీ పోటీ ఉందని, అయితే అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అని మమ్ముట్టి చెప్పారు. “స్టార్ హీరోలవకముందే మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లం. ఇప్పటికీ ఆ పోటీ ఉంది. అయితే మా మధ్య పోటీ పాత్రలు, నటన విషయంలోనే.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం” అని మమ్ముట్టి చెప్పారు.

Related posts