telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తపై కేసు పెట్టిన పూనమ్… అరెస్ట్

Poonam

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే భర్త సామ్ బోంబేను గోవా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. “తన భర్త సామ్ బోంబే తనను బెదిరించడమే కాకుండా తనపై దాడి చేశాడని, వేధించాడని సోమవారం అర్ధరాత్రి పాండే ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేశాం’’ అని కనకోన పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. ప్రస్తుతం పూనమ్ పాండే దక్షిణ గోవాలోని కనకోనలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు. మరోవైపు, పూనమ్‌తో తీసుకున్న అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి సామ్ బోంబే తొలగించడం వారిద్దరి మధ్య ఏదో తేడా జరిగింది అనడానికి ఊతమిస్తోంది. పూనమ్ పాండే, సామ్ బోంబేల వివాహం పది రోజుల క్రితం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫొటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గోవాలో హనీమూన్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేశారు. ఇంతలోనే ఇలా పూనమ్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది. అసలక్కడ ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.

Related posts