telugu navyamedia
సినిమా వార్తలు

“నాని’స్ గ్యాంగ్ లీడర్” ఫస్ట్ లుక్

Gang-Leader

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం “నాని’స్ గ్యాంగ్ లీడర్”. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. “బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను…” అంటూ ఐదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని నాని విడుదల చేశారు. పోస్టర్‌లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నానితో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్‌తో ఈ “గ్యాంగ్ లీడర్” గ్యాంగ్ లో ఉన్నదెవరో చెప్పేశారు. కథానుగుణంగా ఉన్న “నాని’స్ గ్యాంగ్ లీడర్” ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “ఆర్ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Related posts