telugu navyamedia
సినిమా వార్తలు

సమంతకు ఉత్తమ నటి అవార్డు..

అందాల తార టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021” అవార్డ్స్ ను ప్రకటించింది. ఇందులో “ఫ్యామిలీ మ్యాన్-2” రెండు అవార్డులను దక్కించుకుంది.

IN PICS: Samantha Akkineni's different avatars as Raji in The Family Man 2 you cannot miss

మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. సమంత అక్కినేని ఈ సిరీస్‌ లో ఉత్తమ నటన కనబర్చినందుకు అవార్డును సొంతం చేసుకుంది. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

ఓటిటిలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్న “ఫ్యామిలీ మ్యాన్” రిలీజ్ తరువాత మాత్రం వరుసగా అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. 2021 జూన్ 4న విడుదలైన థ్రిల్లర్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఏకంగా 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.

The Family Man' makers defend show amid calls for a ban | Bollywood – Gulf News

ఈ వెబ్ సిరీస్ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పేయి, ఉత్తమ నటి ప్రియమణి, ఉత్తమ సిరీస్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డైలాగ్స్ వంటి విభాగాల కింద ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా విడుదల కానుంది.

Related posts