telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… సినిమాలకు దూరం కానున్న బ్రహ్మానందం ?

BRahmanandam

టాలీవుడ్ లో కొన్నేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఈ హాస్య బ్రహ్మ… సినిమాలకు గుడ్ బై చెప్పేశారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే. కొత్త కమెడియన్స్ హవా నడుస్తుండటం, పైగా బ్రహ్మి వయసు మీదపడటం.. ఇలా కారణం ఏదైనా కావచ్చు కానీ వెండితెరపై బ్రహ్మి కామెడీ మిస్సయ్యామనే మాట మాత్రం వాస్తవం. మరోవైపు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ మేమే ఉండాలని కోరుకోవడం సరికాదని కూడా బ్రహ్మానందం పలుమార్లు చెప్పిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఇకపై సినిమాల్లో నటించకూడదని బ్రహ్మి డిసైడ్ అయ్యారట. కాకపోతే ప్రేక్షకలోకానికి పూర్తిగా దూరం కాకూడదనే ఉద్దేశంతో డైలీ సీరియల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కామెడీ టచ్ ఇస్తూ తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండేలా బుల్లితెర దర్శకులు వినిపించిన కొన్ని కథలు బ్రహ్మికి బాగా నచ్చాయట. వాటిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటించనున్నారని బలమైన టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రేక్షకులకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని బ్రహ్మానందం తరహా కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వార్తలపై బ్రహ్మానందం ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts