telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా పై మెగాస్టార్ వీడియో

chiranjeevi

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి.ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేం కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కొవలసిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ వంటి వాటిని అడ్డం పెట్టుకోవడం, లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం. మీ జలుబు, దగ్గు ఇతరులకి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 

Related posts