telugu navyamedia
సినిమా వార్తలు

‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా’ సాంగ్ ఎలా పుట్టింది..!

తెలుగు రాష్ట్రాల్లో జానపదాల పాటలు మ‌క్కువ ఎక్కువ‌గా చూపిస్తారు. అలాంటిదే ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా…’ ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను,ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఇప్పుడు క్రేజ్‌ రావడానికి కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా సాంగ్‌కు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్‌ ట్రెండ్‌ అయింది. డ్యాన్స్‌తో కొత్త జంటకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అంతేకాదు ఆమె స్టెప్పులకు ఫిదా అయిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’పాట నిర్మాతలు.. తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించారు.

bullet bandi song dance videoTech and Entertainment

ఆ త‌రువాత‌ పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుఈ వ్యవహారంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. ఆన్‌ డ్యూటీలో ఉండటమే కాకుండా.. ఇండిపెండెంట్స్‌ డే రోజున ఇలా పాటలు పెట్టుకోని డ్యాన్స్‌లు చేయడంపై మండిపడ్డారు.

Bullet Bandi! WATCH this nurse grooving to famous song, viral video lands her in trouble | India News | Zee News

డ్యాన్స్‌ చేసిన మహిళకు మెమో జారీ చేశారు. అయితే జ్యోతికి మెమో జారీ చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. స్టాఫ్​ నర్స్​కు లక్షలాది మద్దతుగా నిలిచారు. మెమో వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు సైతం రజినికి సపోర్ట్​ చేశారు. చర్యలు వద్దని అధికారులను కోరారు. ఈ మేరకు కేటీఆర్​కు సైతం సోషల్ మీడియాలో వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతోంది.

అయితే ఈ పాట అందరికి కనెక్ట్‌ అయ్యేలా చేసింది మాత్రం సింగర్‌ మోహనా భోగరాజు. లక్ష్మణ్‌ కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించగా, తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. ఆమె ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది. అయితే ఈ పాట పాడింది ఆమేనని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ‘బుల్లెట్ బండి’సాంగ్‌ వైరల్‌ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని ఆరా తీరుస్తున్నారు.

మరి వైరల్ గా మారుమోగుతున్న ఈ బుల్లెట్ బండి పాట గాయని మోహనా భోగరాజు గురించి తెలుసుకోవాల్సిందే.. వ‌రుస హిట్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న మోహన.. అంత సులభంగా పేరు రాలేదు. దాని వెనుక ఆమె పట్టుదల, కృషి ఉంది. మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతం అన్నా..పాటలన్నా ప్రాణంగా మారింది. అలా చిన్నప్పుటింనుంచే పాటలపై మమకారం పెంచుకున్న మోహన.. ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేది. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఆమె సెలక్షన్స్‌లోనే విఫలమయ్యేది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ పోటీల్లో పాల్గొనేది. అలా ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్‌ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాలాజీ విని ఉదయ్‌ కిరణ్‌ హీరోగా నటించిన ‘జైశ్రీరామ్‌’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా కనీసం గుర్తింపు  కూడా రాలేదు.

Download Imitating Samantha Voice - Mohana Bhogaraju Video Song from Celebrity Interview :Video Songs – Hungama

దీంతో ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తూ..కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్నా ఆమెలో సంగీతం పట్ల మక్కువ పోలేదు. పాటలు పాడాలనే తపించిపోయేవారు. అలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో సంవత్సరన్నర తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కలవాలని నిర్ణయించుకుని మరో గాయని సహాయంతో మొదటిసారి కీరవాణిని కలిసి తాను రికార్డ్‌ చేసిన పాటల క్యాసెట్‌ని ఆయనకి అందించారు.

మోహన వాయిస్‌ విన్న కీరవాణి ఆమెకు ఫోన్‌ చేసి ‘బాహుబలి’ చిత్రంలో పాట పాడే సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. దాంట్లో ఆమె మత్తు మత్తుగా..పాడిన పాటే.. ‘మనో….హరి’. ఆ పాటతో మోహన భోగరాజుకు యువతలో మాంచి క్రేజ్‌ వచ్చేసింది. అలాగే ఆమెకు ఆఫర్స్‌ క్యూకట్టాయి. ‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్‌) పాటలు మోహన గొంతులోంచి జాలువారినవే.సినిమాల్లో పాటలే కాకుండా ప్రత్యేక ఆల్బమ్స్‌ కూడా మోహన చేస్తుంటారు. ఇటీవల ఆమె విడుదల చేసిన ‘బుల్లెట్‌ బండి’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఊరూ వాడా మారుమోగిపోతోంది.

Bullet bandi:మోహన'రాగాలవాన..'బుల్లెట్ బండెక్కి వచ్చేత్తాపా పాట పాడింది ఈమే.. Bullet bandi song original singer mohana bhogaraju

బుల్లెట్‌ బండి ఇలా పుట్టింద‌ట‌

‘బుల్లెట్‌ బండి’ పాట ఎలా పుట్టిందో మోహన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్ళీడుకొచ్చిన‌ ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి? అనేది తాను పెళ్లి చేసుకునే యువకుడి వివరించాలనేది తన కాన్సెప్ట్‌. తన ఆలోచనకు తగినట్లుగా లక్ష్మణ్‌ మంచి లిరిక్స్‌ అందించాడు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట మోహన.

మోహనా భోగరాజు పాడిన పాట‌లు

‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్‌) పాటలతో పాటు ప్రత్యేక ఆల్బమ్స్‌ చేస్తూ వచ్చారు. 2019లో అరవింద సమేత వీర రాఘవ (2019) చిత్రంలోని ‘రెడ్డమ్మ తల్లి’పాటకు మోహనపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు ఈ పాట పాడినందుకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మోహన భోగరాజు నామినేట్ అయ్యింది. అలాగే వకీల్‌ సాబ్‌లోని ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ?’’ అని మహిళ గొప్పతానాన్ని గొంతులో ఫిమేల్‌ వెర్షన్‌ పాడింది ఈ భామనే. వీటితో ‘సైజ్‌ జీరో’, ‘అఖిల్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఇజం’, ‘శతమానం భవతి’, ‘జవాన్‌’, ‘భాగమతి’, ‘సవ్యసాచి’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’, ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’, ‘హిట్’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో మోహన పాటలు పాడింది.

Related posts