telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ

RAVITEJA actor

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ ప్రాజెక్ట్ పై పలువరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పటికే తన స్పందనను తెలియజేస్తూ నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం అని అభివర్ణించారు. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. తాజాగా టాలీవుడ్ నటుడు రవితేజ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు.

Related posts