telugu navyamedia
సినిమా వార్తలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా..

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీ హిల్స్ మీదుగా కారులో ప్రయాణిస్తున్న త్రివిక్రమ్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా ఆయన కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో జరిమానా చెల్లించాలని పోలీసులు త్రివిక్రమ్‌ను కోరారు. అనంతరం కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, రూ.700 జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్మ్‌లు ఉన్న కార్లను టార్గెట్ చేస్తున్నారు.

ఎంతటివారైనా నిబంధనలు అతిక్రమిస్తే వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు.. ఈ క్ర‌మంలో భాగంగా కొన్ని రోజుల‌ క్రితం అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ వంటి హీరోల కార్లకు కూడా ఇలాగే జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి త్రివిక్రమ్‌ కూడా చేరారు.

కార్లకు టింటెడ్ గ్లాసెస్‌పై బ్లాక్ ఫిల్మ్‌ ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బ్లాక్ ఫిల్మ్ తో కార్లలో రోడ్లపై తిరుగుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

గత నెల జూబ్లీహిల్స్​లో బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్​తో ఉన్న కారు పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన మహిళలకు తీవ్రగాయాలు కాగా.. శిశువు మరణిచింది. ఈ ప్రమాదం అనంతరం పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

Related posts