telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆగడు” ఫ్లాప్ కు కారణం నేనే… అనిల్ రావిపూడి కామెంట్స్

Anil-Ravipudi

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందని అంటున్నారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో కామెడీ, ఎమోషన్స్ బాగా పండాయని, సంక్రాంతి మహేష్ అభిమానులు మరింత ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా “ఆగడు” చిత్రం గురించి మాట్లాడారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘ఆగడు’ సినిమా ఊహించని విధంగా ఫ్లాపై ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం నేనే అని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నాకు పటాస్ స్టార్ట్ అవ్వడంతో నేను అటే వెళ్లిపోయా. ఇప్పటికీ వైట్ల గారు నాతో అప్పుడప్పుడూ ఏమయ్యా నాతో సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా అని అంటుంటారు. ఇప్పటికీ ఈ విషయంలో నాకు బాధగానే ఉంది. నేను వైట్ల గారి కోసం కాస్త సమయం కేటాయించి ఉంటే ‘ఆగడు’ మంచి హిట్ అయివుండేది” అని అన్నారు.

Related posts