నందమూరి తారకరామారావు గారు నటించిన జానపద చిత్రం జి.ఆర్. ఫిల్మ్స్ వారి “రాజకోట రహస్యం” 12-03-1971 విడుదల.
నిర్మాత యం.కె.గంగరాజు జి.ఆర్.ఫిల్మ్స్ బ్యానర్ పై జానపదబ్రహ్మ బి.విఠలాచార్య గారి దర్శకత్వంలో ఈ
చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్నికి కధ, మాటలు: పింగళి నాగేంద్రరావు, పాటలు: సి.నారాయణ రెడ్డి, పింగళి నాగేంద్రరావు, కొసరాజు, సంగీతం: విజయా కృష్ణమూర్తి, ఫోటోగ్రఫీ: జి.కె.రాము, నృత్యం: చిన్ని,సంపత్,
కళ: బి.నాగరాజన్, ఎడిటింగ్: కె.గోవిందస్వామి అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, దేవిక, సత్యనారాయణ, మిక్కిలినేని, నాగయ్య, ధూళిపాళ, ముక్కామల, ఛాయాదేవి, రమణారెడ్డి, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు విజయా కృష్ణమూర్తి గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“కరుణించవా వరుణదేవా”
“నను మరువని దొరవని తెలుసు”
“నెలవంక తొంగిచూసింది చలిగాలి మేను సోకింది”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో జానపదబ్రహ్మ బి.విఠలాచార్య గారు కూర్చిన గుర్రపుస్వారీలు, కత్తియుద్ధాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ చిత్రం యావరేజ్ గా నడిచి కొన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది.