telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అన్నీ కుదిరితేనే కీలకపాత్రలో చరణ్… : కొరటాల

Koratala

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. చరణ్ డేట్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకిగాను రాజమౌళి దగ్గర వున్నాయి. అందువలన కొరటాల శివ సినిమా చేయడానికి రాజమౌళి అనుమతిని చరణ్ తీసుకున్నాడు. అయితే ఊహించని విధంగా కరోనా దెబ్బకి అన్ని సినిమాల షెడ్యూల్స్ .. నటీనటుల డేట్లు తారుమారైపోయాయి. దాంతో తన సినిమా ప్లానింగ్ లో తేడా వస్తుండటంతో, రాజమౌళి మనసు మార్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి చరణ్ తప్పుకున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కొరటాల దీనిపై మాట్లాడుతూ .. “కొన్ని ఇబ్బందులైతే వున్నాయి .. అన్నీ కుదిరితేనే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడు” అని చెప్పారు. ఈ సినిమాలో చరణ్ నటించకపోతే అది మెగా అభిమానులను నిరాశ పరుస్తుందని చెప్పాలి.

Related posts