అతిలోక సుందరి శ్రీదేవి వర్ధంతి నేడు. మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి రెండు నాగేళ్లు పూర్తి అయ్యింది. తన నటనతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌గా నిలిచిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా
అదేవిదంగా.. తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్ చేసింది.. ఈ సందర్భంగా జాన్వీ తల్లితో తన చిన్ననాటి ఫోటోను అభిమానులుతో పంచుకుంది..
“ మా” నేను ఇప్పటికే నా జీవితంలో మీరు లేకుండా ఎక్కువ సంవత్సరాలు జీవించాను. కానీ మీరు లేని జీవితానికి మరొక సంవత్సరం యాడ్ అవ్వడాన్ని నేను ద్వేషిస్తున్నాను..మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాను అమ్మా… ఎందుకంటే అది ఒక్కటే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
అలాగే.. జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా తన తల్లి నాల్గవ వర్ధంతి సందర్భంగా శ్రీదేవిని తలచుకుంటూ ఆమెతో ఉన్న పాత ఫోటోను పంచుకున్నారు. ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్ అంటూ పోస్ట్ చేసింది.