బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించాలనుకున్నారు. అయితే చివరి నిముషంలో క్యాన్సిల్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.
గణేష్ ఉత్సవాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉండడంతో అనుమతి ఇవ్వలేమని రాచకొండ పోలీసులు తెలిపారు. బ్రహ్మాస్త్ర ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూ.ఎన్టీఆర్ హాజరుకావాల్సి ఉంది.
మరోవైపు ఇటీవల కేంద్రమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ఈవెంట్‌కు అనుమతి నిరాకరణపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
గత నెల 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే… చివరి నిమిషంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఈవెంట్ ఆర్గనైజర్స్.
‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనుమతులు నిరాకరించడమే కారణం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని అనుమతులు ఇవ్వలేదని సమాచారం. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
గాంధీ జయంతిపై మంచు విష్ణు ఘాటు ట్వీట్… వారిని ఉద్దేశించే…!