telugu navyamedia
సినిమా వార్తలు

“మా” ఎన్నికలు : శివాజీ రాజా పనితీరుతో అసంతృప్తి – నరేష్

Naresh-and-Shivaji-Raja

మా అసోసియేషన్ కి అధ్యక్షుడుగా ఉన్న శివాజీరాజా పదవీకాలం పూర్తి అయిపోయింది. దీంతో మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివాజీరాజా మళ్ళీ పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు సీనియర్ హీరో నరేష్ కూడా రంగంలోకి దిగారు. ఈనెల 10న జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం శివాజీరాజా, నరేష్ ఇద్దరూ తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక “మా” సభ్యులు కూడా తనకు నచ్చిన వారికి మద్దతు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ… “గతంలో నేను నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్… అందరం కలిసి ఒక్కో టర్మ్ అధ్యక్షుడుగా పని చేసి తప్పుకుందామని అనుకున్నాము. దాంతో ఆయన ఒక టర్మ్ అధ్యక్షుడుగా పూర్తి చేసి చాలా హుందాగా పక్కకు తప్పుకున్నారు. అందుకు నేను ఆయనకు హ్యాట్సాఫ్ చెప్తున్నాను. ఆ తరువాత శివాజీరాజా కోరిక మేరకు ఆయన అధ్యకుడు కావడానికి సహకరించాను. శివాజీరాజాకు నా అంత అనుభవం లేకున్నప్పటికీ, మంచి మనసుతో ఆయనకు అండగా నిలిచాను. కొన్ని కారణాల వల్ల శివాజీ రాజా పనితీరుపై చాలామందిలో అసంతృప్తి పెరిగింది. అందుకే ఇప్పుడు నేను రంగంలోకి దిగాను. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే సరికొత్త విధానాలతో ముందుకు వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.

Related posts