telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముంబై వదిలి వెళుతున్నాను తప్ప… ముంబైని వదిలే ప్రసక్తే లేదు : రాజేష్‌ కరీర్

Rajesh-Karir

కరోనా మహమ్మారి వల్ల హిందీ పాపులర్ టీవీ యాక్టర్‌ రాజేష్‌ కరీర్‌ లాక్‌డౌన్‌ కష్టాలు ఎదుర్కొక తప్పలేదు. 30 జూలై, 2019 నుంచి తనకి ఎటువంటి వర్క్ లభించలేదని, అందువల్ల డబ్బులు ఎలా వస్తాయో అర్థం కాలేదంటూ ఫేస్‌బుక్‌లో ఆర్థిక సహాయం కోరుతూ ఆయన పోస్ట్ చేసిన హృదయ విదారక వీడియోను చూసిన వారంతా రాజేష్ కరీర్‌కు ఆర్థిక సహాయం చేశారు. సుమారు రూ.12 లక్షల వరకు తనకు వచ్చాయని, ఇకపై ఎవ్వరూ నాకు డబ్బులు పంపించవద్దని, నేను బ్రతకడానికి సరిపడా డబ్బులు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆయన తెలియజేశారు. ‘‘ప్రస్తుతం స్వరాష్ట్రం అయిన పంజాబ్ వెళ్లేందుకు ముంబై వదిలివెళుతున్నాను తప్ప.. ముంబైని వదిలే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. నా జీవితం మొత్తం ముంబైలోనే పని చేశాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముంబైని ఇప్పుడప్పుడే కరోనా వదిలేట్లు కనిపించడం లేదు. అందుకే నా స్వస్థలానికి వెళ్లి ఏదైనా చిన్న పని చేసుకోవాలని అనుకుంటున్నాను. పని దొరికే సరికి మరో 6 నుంచి 8 నెలల వరకు సమయం పట్టవచ్చు. పంజాబీ చిత్రాలలో నటించడానికి ప్రయత్నిస్తాను. ముంబై నా హృదయంలో ఉంది. మళ్లీ ముంబై నన్ను పిలిచిప్పుడు ఖచ్చితంగా వస్తాను. ప్రస్తుతం నాకు మళ్లీ జీవితం ప్రసాదించిన దాతలకు రుణపడి ఉంటాను.’’ అని రాజేష్ కరీర్ తెలిపారు.

Related posts