telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కడి సొత్తో, సొమ్మో కాదు… ఏంటేంటి చెడు చెవిలో చెప్పాలా? : బాలకృష్ణ

Balakrishna

జూన్ 10తో బాలకృష్ణ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా బాలకృష్ణ వివిధ చానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాడు చిరంజీవి పలికిన ‘మంచి మైక్‌లో.. చెడు చెవిలో’ పదాన్ని సదరు యాంకర్.. బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా ఆయన శైలిలో రియాక్ట్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ‘నేను అన్నమాటలతో చాలా మంది హర్ట్ అయ్యారని అంటున్నారు.. నేను ఏం మాట్లాడినా మంచి కోసమే మాట్లాడతా.. నేను ఎమోషనల్ మనిషిని అని అందరికీ తెలుసు. అయినా ఇండస్ట్రీ విషయాలు నేను పెద్దగా పట్టించుకోను. కాని నన్ను కావాలని మీడియా వాళ్లే అడిగారు. నా అంతట నేను చెప్పలేదు. మీరు అడిగారు నేను చెప్పాను. నా స్వభావం అటువంటిది. నాకు నచ్చలేదు అంటే నచ్చలేదనే చెప్తా.. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడను. నాకు మర్యాద ఇచ్చి మర్యాదు పుచ్చుకోండి.. సింగిల్ ట్యాగ్ అంతే. ఇందులో తేడా వస్తే మాత్రం బాగోదు. నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటా. ఏంటేంటి.. చెడు చెవిలో చెప్పాలా?? ఎదుటి వాడు చెడు చేశాడంటే మనం చెప్పడం వల్ల వాడు మారితే ఆ తృప్తి అయినా ఉంటుంది కదా.. నేను ఒకర్ని వ్యక్తిగతంగా అనలేదు. పేరు పెట్టి దూషించలేదు. అందర్నీ కలిపే అన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కడి సొత్తో, సొమ్మో కాదు. ఇండస్ట్రీ అందరిది. మనకి ఎందుకులే అని కూర్చునే వాళ్లు కూర్చుంటారు. లేదంటే అందరికీ రిప్రజెంటేషన్ ఒక్కడే కావచ్చు. కాని నేను అలా కాదు.. నాకు ప్రతిదీ తెలియాలి’ అంటూ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ.

Related posts