telugu navyamedia
సినిమా వార్తలు

ఒళ్లు గగుర్పొడిచే లా ‘ఆర్​ఆర్​ఆర్’​ ట్రైలర్ ..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్. ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ సాంగ్స్‌, మేకింగ్‌ వీడియోలు ఫ్యాన్స్‌కు ఆక‌ట్టుకున్నాయి.

Image

తాజాగా​ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నసినిమా ట్రైలర్ విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్షన్​ సన్నివేశాలు థియేటర్లను దద్దరింప చేశాడు.ఇందులో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన అదిరిపోయింది.

RRR Movie runtime interesting updates and trailer - Sakshi

చిన్ననాటి నుండి స్నేహితులైన భీమ్, రామ్ మార్గాలు… పెద్దయ్యాక వేర్వేరుగా అయిపోతాయి. అడవి బిడ్డలైన గోండ్ల కాపరిగా భీమ్ పెరిగితే, ఆంగ్లేయ పాలకులను కాపాడే పోలీస్ అధికారిగా రామ్ ఎదుగుతాడు. గోండ్ల బిడ్డను బ్రిటీషర్స్ ఎత్తుకెళితే, వారి కాపరిగా భీమ్ చేసే గాండ్రింపుకు పులి సైతం బెదిరిపోతుంది. అలాంటి పులిని పట్టించే వేటగాడిగా బ్రిటీషన్స్ తరఫున రామ్ రంగంలోకి దిగుతాడు. అయితే… అటుపక్క ఉన్నది తన సోపతి అని తెలిసి ఆశ్చర్యపోతాడు. చేసిన తప్పును దిద్దుకుంటూ భీమ్ తో రామ్ చేతులు కలిపి, బ్రిటీషర్స్ ఆగడాలను అరికట్టడమే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది.

Jr NTR and Ram Charan are impressive in RRR trailer.

మొత్తంగా ఈ ట్రైలర్​ సినిమాపై ఆసక్తిని మరింత భారీగా పెంచింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన అదిరిపోయింది. “భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

పులిని ప‌ట్టుకోవాలంటే వేట‌గాడు కావాలి..ఆప‌ని చేయ‌గ‌లిగేది ఒక్క‌డే సార్‌..భాణం క‌న్నా విలువైన నీ సుపాతి నా సొంతం అన్న‌..బ్రిటీష్ ప్ర‌భుత్వానికి ఎదురుతిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా..ఎదురువ‌చ్చిన వాడిని ఎసుకుంటూ పోవాలే అంటూ ఎమోష‌న‌ల్ డైలాగ్స్ అదిరిపోయాయి.

సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్ . సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు.

కాగా..థియేటర్లలో విడుదలైన ‘ఆర్​ఆర్​ఆర్’​ ట్రైలర్​ను చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు భారీ సంఖ్య‌లో  చేరుకుంటున్నారు.

Related posts