telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేము చాలా స్వార్థపరులం… తల్లి కాబోతుందన్న వార్తలపై దీపికా స్పందన

ranveer singh

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా యూత్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మెరుపుతీగ బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ ను గత సంవత్సరం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు వివాహం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ సూపర్ హిట్ జోడిగా నిలిచారు. ప్రస్తుతం ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం దీపిక చేసిన ఓ కామెంట్. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న రణ్‌వీర్‌ను.. దీపికా `హాయ్‌ డాడీ` అంటూ పలకరించింది. అంతేకాకుండా దానికి బేబీ ఎమోజీని కూడా జతచేసింది. దీంతో దీపిక తల్లి కాబోతోందంటూ వార్తలు మొదలయ్యాయి. అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీపిక, రణ్‌వీర్ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అదంతా అబద్ధమని దీపిక తేల్చేసింది. “ఇలాంటి రూమర్లు మాకు కొత్త కాదు. మాకు కూడా తల్లిదండ్రులవ్వాలనే ఉంది. కానీ, మేం చాలా స్వార్థపరులం. కెరీర్ గురించి స్వార్థంగా ఆలోచిస్తున్నాం. పిల్లల గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాము” అని దీపిక స్పష్టం చేసింది.

Related posts