నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఎంతమంచివాడవురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెండో లిరికల్ వీడియో సాంగ్‌గా మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “అవునో తెలియదు కాదో తెలియదు ఏం నవ్వో ఏమో…” అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ మెలోడీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరోపై తనకున్న ప్రేమను హీరోయిన్ తెలియజేస్తుంది. బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. జాతీయ అవార్డ్ గ్రహీత గోపీసుందర్ సంగీత సారథ్యం వహించిన ఈ పాటను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
previous post