telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

నేటి నుండి .. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్ష…

written exam for village secretary jobs from today

ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్ష ప్రారంభమయింది. ఈ పరీక్షలో 14,944 సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. రెండు సమయాల్లో పరీక్ష జరుగతుంది. ఉదయం కేటగిరి-1, మధ్యాహ్నం 2.30కు కేటగిరీ -2 పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు 13 జిల్లాల్లోని 4,478 పరీక్ష కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

ఉదయం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, వార్డు మహిళా పోలీస్, సంక్షేమ, విద్య కార్యదర్శి(గ్రామ), వార్డు పరిపాలన కార్యదర్శి(పట్టణ) పోస్టులకు 12,10,432 మంది పోటీ పడుతున్నారు. మిగితా వారు మధ్యాహ్నం నిర్వహిచబడే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష రాస్తారు. నిర్వహణకు ప్రభుత్వం వివిధ శాఖల నుంచి 1,22,554 మంది అధికారులు, ఉద్యోగులను నియమించింది. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts