మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురంలో పట్టున్న సీనియర్ నేత టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. పెద్దాపురం టికెట్ ను ఆశించిన ఆయనకు అధిష్ఠానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం పెద్దాపురంలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన, తన మనసులోని మాటను చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల తనకు టికెట్ విషయంలో పార్టీ నేతలను కలిసిన ఆయన, 6వ తేదీ వరకూ నిర్ణయం కోసం ఎదురు చూస్తానని, ఆపై తన దారి తాను చూసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
పెద్దాపురం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోమ్ శాఖను చూస్తున్న చినరాజప్ప ఉండగా, మరోసారి ఆయనకే టికెట్ ఖరారైంది. దీనితో చంద్రబాబు వద్దకు వెళ్లిన బొడ్డు, చినరాజప్పకు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం టికెట్ ను ఇవ్వాలని, తనకు పెద్దాపురం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందనపై మనస్తాపంతో ఉన్న ఆయన పార్టీని వీడనున్నట్టు సమాచారం.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్