telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్‌ దేవరకొండ‘ఫైటర్’కు లైన్‌ క్లియర్‌..

Fighter

క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ మారిందని టాక్‌. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్‌’ టైటిల్‌ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషల్లో ఈ టైటిల్‌ దొరకలేదట. కొన్ని అనివార్య కారణాల వలన సినిమాలో హీరో పేరు ‘లైగర్‌’ను టైటిల్‌గా ఖరారు చేశారట. ‘ఫైటర్‌’ బన్‌గయా ‘లైగర్‌’ (మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్‌ అంటారు). ఈ మూవీలో అనన్యపాండే హీరోయిన్‌. అయితే..లాక్‌డౌన్‌ వలన ఆగిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికీ రీస్టార్ట్‌ కాలేదు. కోవిడ్‌ సమస్యల మూలాన విదేశీ ఫైటర్లు దొరక్కపోవడంతో సినిమా ఆలస్యమైనట్లు టాక్‌ వచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైందట. ముంబైలోనే తిష్ట వేసిన పూరి సమస్యలను క్లియర్‌ చేసుకున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ జనవరి నుంచి మొదలు కానుంది. అలాగే సంక్రాంతికి ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేసే ఆలోచన చేస్తుందట పూరి టీమ్‌.

 

Related posts