telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్ ఆర్ ఆర్‌ సందడి మొదలైంది.

అయితే..ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ వ‌ద్ద విషాదం చోటుచేసుకుంది. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా చూస్తూ థియేటర్ లో గుండెపోటుతూ ఓబిలేసు (30) అనే అభిమాని మృతి చెందాడు.

ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు(30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. 

సినిమా రిలీజ్ సందర్భంగా గత రాత్రి నుంచి సినిమా థియేటర్ వద్ద ఓబిలేసు సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో థియేటర్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది.

 

Related posts