telugu navyamedia
సినిమా వార్తలు

56 సంవత్సరాల “నిలువు దోపిడి”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం మంజులా సినీ సిండికేట్ వారి “నిలువు దోపిడి” 25-01-1968 విడుదల. నిర్మాత యు.విశ్వేశ్వరరావు గారు మంజులా సినీ సిండికేట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్రానికి కథ: యు.విశ్వేశ్వరరావు, మాటలు: త్రిపురనేని మహారధి, సంగీతం: కె.వి.మహదేవన్, పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, సి. నారాయణరెడ్డి, శ్రీ శ్రీ, విశ్వేశ్వరరావు, బుర్ర కథ: నాజర్ బృందం, ఫోటోగ్రఫీ: జి. కె.రాము, కళ:ఎస్.కృష్ణారావు, నృత్యం: తంగప్ప, కూర్పు: ఆర్.హనుమంతరావు అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, దేవిక, కృష్ణ, జయలలిత, నాగయ్య, నాగభూషణం, రేలంగి, పద్మనాభం, రాజబాబు, సూర్యాకాంతం, ప్రభాకరరెడ్డి, హేమలత,రమాప్రభ, రాజనాల, ధూళిపాళ, నెల్లూరు కాంతారావు తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ సంగీత సారధ్యంలో పాటలు హిట్ అయ్యాయి.
“చుక్కమ్మ అత్తయ్య రో బుల్ బుల్ బుల్'”
“అయ్యింది అయ్యింది అనుకున్నది” వంటి పాటలు
“ఓఅయ్యలార,ఓ అమ్మలార,మముగన్న తల్లులారా”
నాజర్ బృందం బుర్ర కధ శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో శ్రీ శ్రీ రచించిన “నేనే ధనలక్ష్మి” అనే నృత్య రూపకంలో ఎన్టీఆర్ గారు మహావిష్ణువుగా కనిపిస్తారు. ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి, శతదినోత్సవం జరుపుకున్నది.
విజయవాడ – జైహింద్ టాకీస్ లో (78రోజులు) + దుర్గామహాల్ లో (23 రోజులు) = 101రోజులు ప్రదర్శింపబడింది.
నందమూరి తారకరామారావు గారికి పద్మశ్రీ అవార్డు అందుకున్న పిదప శతదినోత్సవం జరుపుకున్న మొదటి సినిమా “నిలువు దోపిడి” కావటం విశేషం.

Related posts