telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ద ఫ్యామిలీ మ్యాన్ 2 : బోల్డ్ పాత్రలో సమంత !

మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి, గుల్ ప‌నాగ్, సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన`ది ఫ్యామిలీమ్యాన్` వెబ్ సీరిస్ సీజ‌న్ 1కు విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. దాంతో రెండో సీజ‌న్ కోసం వీక్ష‌కుల‌కు క‌ళ్ళు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ వెజ్ సీరిస్ సీజ‌న్ 2న డిలే చేస్తూ వ‌చ్చారు. అయితే… ఇక వీక్ష‌కుల ఎదురుచూపుల‌కు ఫుల్ స్టాప్ ప‌డే రోజు వ‌చ్చేసింది. బుధ‌వారం `ది ఫ్యామిలీ మ్యాన్ 2` ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. అందులో ఖ‌చ్చితంగా ఈ వెబ్ సీరిస్ ద్వితీయ‌భాగం ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈసారి సరికొత్త పాత్రలో సమంత కూడా కనిపించనుంది. ఆమె పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఒక బోల్డ్ పాత్రలో నటించినట్లు దర్శకులు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. సమంత బోల్డ్ గెట్ అప్ లో కనిపించనున్నట్లు కూడా వార్తాలు వస్తున్నాయి.

Related posts