telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

ఎస్ఎస్‌సీ .. స్పాట్ వాల్యూయేషన్‌లో .. తప్పులు జరిగాయి .. : విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్

mistakes happend in ssc spot valuation said rajiv

పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ ఎస్ఎస్‌సీ స్పాట్ వాల్యూయేషన్‌లో తప్పులు జరిగాయని అంగీకరించారు. కొందరు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు దొంగసర్వీసు సర్టిఫికేట్ ఇచ్చిన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేశామని అన్నారు. ఎప్పటికప్పుడు రిపోర్టులు ఉన్నతాధికారులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ దీనికి సంబంధించి ఉపాధ్యాసంఘాలు రిప్రజెంటేషన్ ఇచ్చారని.. దానిపై విచారణ చేశామని చెప్పారు. మూడళ్లుగా పదోతరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకే స్పాట్ వాల్యూయేషన్‌ చేసే అర్హత ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ఇద్దరు అర్హత లేని ఉపాధ్యాయులు స్పాట్ వాల్యూయేషన్‌ చేసినట్లు తన విచారణలో తేలిందని.. ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపించానని, ఆ ఇద్దరు ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లు మళ్లీ స్పాట్ వాల్యూయేషన్‌ చేయించాలని తనకు అధికారులు సూచించారని రాజీవ్ తెలిపారు.

ఆ పపేర్లు కూడా రీ వాల్యూయేషన్ చేయించామని చెప్పారు. రాజ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలికి దొంగ సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చిన హెడ్‌మాస్టార్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అలాగే ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, అనితపై చర్యలు తీసుకోవాలని అన్నతాధికారికి రిపోర్డు చేసినట్లు రాజీవ్ స్పష్టం చేశారు.

Related posts