telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం…

Corona Virus Vaccine

గత నెల కిందటి వరకు కరోనా కేసులు దేశంలో తగ్గుతూ వచ్చిన ప్రస్తుతం మాత్రం మళ్ళీ విపాటితంగా నమోదవుతున్నాయి. అయితే కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.  సెలవు రోజుల్లోనూ కరోనా టీకాను అందించాలని కేంద్రం సూచనలు చేసింది. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  బయటకు వెళ్ళాలి అంటే భయపడుతున్నారు.  కేసులు పెరుగుతుండటంతో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారని వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.  ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్ డౌన్ విధించబోమని ప్రభుత్వాలు చెప్తున్నా, కేసులు ఇలాగే పెరిగితే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇప్పటికే ఆసుపత్రుల్లో కరోనా రోగులతో ఫుల్ అవుతున్నాయి.  కరోనా బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Related posts