రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత నెలకొంది… ఇప్పటికే ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో.. సెషన్స్ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అఖిల ప్రియ… ఇవాళ ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనుంది సెషన్స్ కోర్టు.. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అఖిలప్రియ భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి.. వారు ధాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సికింద్రాబాద్ కోర్టు విచారణ జరపనుంది.. ఇక, ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నేడు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు బోయిన్‌పల్లి పోలీసులు.. అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్స్ సంపత్, మల్లికార్జున్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను ఇవాళ కస్టడీలోకి తీసుకోని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. ఈ కేసులో అఖిలప్రియ చెప్పిన సమాధానాలను బేస్ చేసుకుని.. ఆమె అనుచరులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. చుడాలిమరి ఈ విచారణలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది.
previous post
next post