telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అక్కడ మళ్ళీ పొడిగించిన కరోనా నిబంధనలు…

corona america

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను వణికిస్తోంది. అయితే కొన్ని దేశాలలో ఈ వైరస్ ప్రభావం తగ్గుతున్న తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభన తగ్గకపోవడంతో కరోనాకు సంబంధించిన అన్ని రకాల నిబంధనలను పొడింగించేందుకు జర్మనీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశంలోని ప్రజల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ‘నేడు తాజాగా దేశంలోని కరోనా సంబంధిత సమావేశాలను జరిపాము. ప్రజల ఆరోగ్య రీత్యా వారి శ్రేయస్సు కోసం దేశంలో కరోనా నిబంధనలను మరికొన్నాళ్లు పొడిగించనున్నా’మని జర్మనీ చాన్సెలర్ మార్కెల్ తెలిపారు. అంతేకాకుండా దేశంలోని కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని ఇది ఎంతో ఉత్సాహపరిచేటటువంటి పరిణామం అని ఆమె అన్నారు. దేశంలో యూకే స్ట్రెయిన్ కరోనా ఎంత వరకు విస్తరించిందనేది ఇంకా తేలలేదు. అతి త్వరలోనే దీని విజృంభన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుచేత దేశంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని కరోనా నిబంధనలను వచ్చేనెల అంటే ఫిబ్రవరీ14 వరకు పొడిగించనున్నట్లు తెలిపారు. అయితే జర్మనీలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 2మిలియన్ల పైమాటే, 47,000 మంది మరణించారు. అందుకనే దేశంలోని ప్రతి పౌరుడు జాగ్రత్త వహించాలని, నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం కోరింది. చూడాలి మరి అక్కడ ఇంకా ఎన్ని రోజు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి అనేది.

Related posts