telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

స్వలింగ సంపర్కానికి .. సై అన్న .. తైవాన్ ..

taiwan also green signal to Homosexuality

రానురాను స్వలింగ సంపర్కుల హక్కులపై యావత్ ప్రపంచం స్పదిస్తుంది.. అనడానికి మరో ఉదాహరణ.. తాజాగా ఆసియా దేశం తైవాన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును శుక్రవారం ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది. ఫలితంగా రెండేళ్లుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. \

ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు వీధుల్లోకి వచ్చి కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. ఆ తర్వాత పలు దేశాలు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. నార్వే, స్వీడన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. ఇప్పుడు వాటి సరసన తైవాన్ చేరింది.

Related posts