telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేసీఆర్‌ సర్ మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు : బండ్ల గణేష్ ట్వీట్

bandla ganesh in bigg boss 3 conditions apply

ప్రముఖ కమెడియన్, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్ కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కరోనా వైరస్ ప్రాథమిక దశలో ఉన్న తరుణంలో చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తోందంటూ ప్రచారం నడిచింది. దీంతో పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో వాళ్లను ఆదుకునేందుకు కేటీఆర్, తలసాని, ఈటల రాజేందర్ తదితరులు రంగలోకి దిగారు. చికెన్ మేళాలు నిర్వహించి మరీ అపోహల్ని తొలగించారు. అందుకు గానూ అప్పట్లో కెసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు బండ్ల. తాజాగా మరోమారు కెసిఆర్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ వదిలాడు బండ్ల. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఇంకొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదములు.. గర్భిణీ స్త్రీల పట్ల మీరు చూపించిన జాగ్రత్త వారికి ఇచ్చిన భరోసా, లాక్ డోన్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం సార్. మీ మాటలు వింటుంటే సాక్షాత్తూ భగవంతుడే మీ లో ప్రవేశించి మీ ద్వారా మాకు చెప్పినట్టు ఉంది సార్. మా పెద్దలు మాకు నందమూరి తారక రామారావు సాక్షాత్ భగవత్ స్వరూపం అని చెబుతూ ఉండేవారు. మేము ఇప్పుడు చూస్తున్న కె చంద్రశేఖర రావు అని మీరు సాక్షాత్తు భగవత్ స్వారుపులని మాకు నమ్మకం కలుగుతుంది. వ్యవసాయ రంగంలో మీరు అందిస్తున్న అండ భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వం రైతులకు అందించడం లేదు. రైతు పక్షపాతి రైతు బిడ్డ అని మీరు ఒక సారి నిరూపించుకున్నారు సార్.. తెలంగాణ తల్లుల ఆశీస్సులు తో మీరు వందేళ్లు చల్లగా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అంటూ వరుస ట్వీట్లతో కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు బండ్ల గణేష్.

Related posts