telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేడే అధ్యక్షునిగా బాధ్యతలు అందుకోనున్న బైడెన్‌…

Joe Biden USA

అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ ఉరఫ్‌ జో బైడెన్‌ అలియాస్ జో బైడెన్ బేదు‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 78 ఏళ్ల వయస్సులో ఆయన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. విజయం సాధించారు బైడెన్.. అయితే.. ఈ విజయాన్ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదు. చివరకు ఆ దేశ కేపిటల్ భవనంపైనే దాడి జరిగింది.. వాషింగ్టన్లోని కేపిటల్‌ భవనంపైకి దూసుకొచ్చిన ట్రంప్ మద్దతుదారులు… విధ్వంసం సృష్టించారు.. కొంతమంది ప్రాణాలు పోగా.. చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే, అదే కేపిటల్‌ హిల్‌ భవనం సాక్షిగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనన్నారు బైడెన్.. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కూడా ప్రమాణం చేస్తారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.. కేపిటల్‌ భవనంపై దాడిని దృష్టిలో ఉంచుకొని.. గతంలో ఎన్నడూలేని విధంగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. భద్రతాసిబ్బందిలో ఎవరైనా ట్రంప్‌-అనుకూలురు దాడి చేస్తారేమోనన్న భయం కూడా ఉండడంతో సీక్రెట్‌ సర్వీస్‌, ఆర్మీ ఏ ఛాన్సూ తీసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా అతివాద జాతీయవాదులు హింసా విధ్వంసాలకు దిగొచ్చన్న సమాచారం రావడంతో మొత్తం 50 రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related posts