telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఆపిల్ సైడర్ వెనిగర్ … ఆరోగ్య ప్రయోజనాలు ..

apple cider vinegar is v.good for health

ఆపిల్ సైడర్ వెనిగర్ భారత దేశంలో ఆలస్యంగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం దుష్ట్యా ఇప్పుడిప్పుడే ఇది వాడుకలోకి వస్తుంది. దీనిని సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఉపయోగించవచు. వెనిగర్ లో సున్నా కేలరీలు ఉంటాయి, రుచిని పెంచుతాయి మరియు యాసిడ్ రిఫ్లక్స్-బాధితులు ,డయాబెటిక్ పేషెంట్లు కు మినహా మిగతావారికి ఆరోగ్య హాని చాల తక్కువనే చెప్పాలి. ఇది రోజూ వారి జీవితం లో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. డయాబెటిస్ నుండి బరువు పెరగడం వరకు ప్రతిదీ రివర్స్ చేస్తుందనే ప్రచారం వాటి వెనుక సరి అయినా ఆధారాలు లేవు. కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్ ని స్పూన్ ఫుల్స్ మింగడం లేదా డబ్బు వృథా చేయవలసిన అవసరం లేదు. మీరు బదులుగా అసలు ఆపిల్ తినడం మంచిది, ఇది ఫైబర్ మరియు అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు :

* దీనిని డ్రెస్సింగ్ గా ఉపయోగించడం వల్ల మీ క్రానిక్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

* దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది.

* దీని ఉత్పత్తిలోని యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు, ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

* పప్పుధాన్యాలు, కాయలు మరియు విత్తనాలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి, ప్రకృతి యొక్క ఉత్తమ ఆహారాల నుండి మీ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను పొందడం 100% మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

Related posts