“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన “సాహో” ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల రొమాన్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. టేకింగ్, ప్రభాస్ నటన, యాక్షన్ పార్ట్, హై టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ట్రైలర్‌ని ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న ఈ ట్రైలర్‌పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ముందుగా తెలుగు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా “సాహో” విశేషాలను ప్రభాస్ మీడియాకు వివరించాడు. “సాహో” ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు కూడా బాగా స్పందించారని ప్రభాస్ తెలిపాడు. “సాహో” ట్రైలర్ చూసి చిరంజీవి తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అది చూసి తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని అన్నాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేశానని యంగ్ రెబల్ స్టార్ కామెంట్ చేశాడు. ఇది తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. దర్శకుడు రాజమౌళికి కూడా “సాహో” ట్రైలర్ నచ్చిందని తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ వివరించాడు. ఇక “సాహో” కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని ప్రభాస్ చెప్పాడు. కొన్ని యాక్షన్స్ సీన్స్ కోసం నెలల పాటు శ్రమించామని అన్నారు. బాహుబలి కంటే ముందే దర్శకుడు సుజిత్ తనకు “సాహో” స్టోరీ చెప్పారన్న ప్రభాస్… బాహుబలి విజయం “సాహో”పై మరింత ఫోకస్ పెట్టేలా చేసిందని అన్నాడు. ఈ కారణంగానే సినిమా బడ్జెట్ కూడా పెరిగిందని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. “సాహో” సినిమాకు హిందీలోనూ తానే డబ్బింగ్ చెప్పానన్న ప్రభాస్… సినిమాలో యాక్షన్ సీన్స్ అందరినీ మెప్పించే విధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
విజయ్ దేవరకొండపై “ఫలక్‌నుమా దాస్” కామెంట్స్ ?