telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వార్ బ్యాక్ డ్రాప్‌లో కంగనా రనౌత్ “తేజస్”

Tejas

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘తేజస్’. ఆర్ఎస్‌వీపీ ప్రొడక్షన్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా సర్వేశ్‌ మేవర దర్శకత్వం వహిస్తున్నారు. సోమవార ఈ చిత్రంలోని కంగన లుక్ రిలీజ్ చేశారు. ‘తేజస్’ సినిమాలో యుద్ధ విమానం నడిపే పైలెట్ గా ఆమె కనిపించనున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కనిపిస్తున్న కంగనా లుక్‌కు ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో వచ్చిన ‘యురి’ తర్వాత అదే నిర్మాత నుంచి వార్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న చిత్రం ఇది. ‘తేజస్’ వచ్చే ఏడాది ఏప్రిలో‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నటించిన ‘పంగా’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. మహిళా కబడ్డీ మాజీ ఛాంపియన్‌ జయా నిగమ్‌ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలోని కంగన నటకు మంచి మార్కులే పడినప్పటికీ మూవీ కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయింది. ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు‌. ఈ చిత్రం 2020 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts